పోషకాహార లోపాన్ని నివారించండి
Published Sat, Jul 30 2016 6:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
♦ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత
విజయనగరంఫోర్ట్: పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీలతో శనివారం ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–పాస్ విధానంద్వారానే అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పిల్లల్లో రక్తహీనతను 50శాతం వరకు తగ్గించాలన్నారు. పిల్లలకు తల్లి పాలు 6 నెలల వకుకు తాగించేలా బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్న 596 అంగన్‌వాడీ భవనాలను త్వరితగతిన నిర్మిం చాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పూర్థిస్థాయిలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement