శ్రీశైలంలో మాడ వీధులకు నూతన శోభ
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మాడవీధులు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే సుమారు రూ.86లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ఉత్తర మాడవీధిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. పడమర మాడవీధిలో అభివృద్ధి పనులు ఇటీవలె ప్రారంభమ్యయి. దక్షిణ మాడ వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. శివరాత్రి, సంక్రాంతి బ్రహోత్సవాలు..ఉగాది, దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఇతర పర్వదినాలల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాడవీధుల్లో భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది.