భద్రత..ఎంత? | No security measures at Nellore Railway Station | Sakshi
Sakshi News home page

భద్రత..ఎంత?

Published Wed, Sep 14 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

భద్రత..ఎంత?

భద్రత..ఎంత?

 
  •  రైల్వేస్టేషన్‌లో కనిపించని మెటల్‌ డిటెక్టర్లు, స్కానర్లు
  •  తనిఖీలు శూన్యం
  •  మేలుకోని భద్రతా అధికారులు 
 
ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాద ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు ప్రజలకు భద్రత కరువైంది. తాజాగా నెల్లూరు నడిబొడ్డున ఉన్న జిల్లా న్యాయస్థానం ఆవరణలో బాంబు పేలడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు భద్రత ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
నెల్లూరు(సెంట్రల్‌): రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించే ప్రయాణికులను స్కాన్‌ చేయాల్సిన మెటల్‌ డిటెక్టర్లు, ప్రయాణికుల వెంట తీసుకుని వచ్చే సామగ్రిని తనిఖీ చేయాల్సిన స్కానర్లు నెల్లూరు రైల్వేస్టేషన్‌లో లేకపోవడం మన భద్రత వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం. ప్రధానంగా ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల్లో అత్యంత తొక్కిసలాట జరిగే రైల్వేస్టేషన్‌గా నెల్లూరును గుర్తించారు. కాని భద్రతలో ఇంకా మేలుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ నుంచి వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైల్వేస్టేషన్‌ సమీపంలోని సౌత్‌స్టేషన్‌ నుంచి కూడా నిత్యం ఉద్యోగులు, వ్యాపారులు ఎంతో మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అయితే నెల్లూరు స్టేషన్‌ కిటకిటలాడుతోంది. వీటికి తోడు ఉన్నతాధికారులు, వీఐపీలు స్టేషన్‌కు వస్తుంటారు. ప్రయాణికులు, వీఐపీల భద్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ విధంగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  .
భద్రత నిల్‌ 
నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎవరైనా టికెట్‌ తీసుకుని రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెడితే అతని పూర్తి భద్రతను రైల్వే స్టేషన్‌ అధికారులు చూసుకోవాలి. రైల్వే స్టేషన్‌లోకి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఒక్కో దానిలో రెండు మెటల్‌ డిటెక్టర్లు ఉండాలి. ప్రతి మెటల్‌ డిటెక్టర్‌ వద్ద ఇద్దరు సంబంధిత పోలీసులు ఉండాలి. వచ్చిన వారిని పరికరం ద్వారా పంపించే విధంగా చెబుతూ వారి వెంట తెచ్చుకున్న సామగ్రిని తనిఖీలు చేయాల్సింది. అంతే కాకండా స్టేషన్‌ ప్లాట్‌ చివరి ప్రాంతాల వైపుల నుంచి ఎవరు వస్తున్నారు అనే నిఘా ఏర్పాటు చేసి వారు ఏమి తీసుకుని వస్తున్నారో గమనిస్తుండాలి. కాని వీటిలో ఏ ఒక్కటి జరుగుతున్నట్లు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మెటల్‌ డిటెక్టర్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడాదిగా మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టారని అధికారులు చెబుతుండటం గమనార్హం. మరో నెల రోజుల్లో నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగ దృష్ట్యా భక్తులు వేల సంఖ్యలో స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక నైనా ప్రయాణికుల భద్రత దృష్ట్యా భద్రత పరికరాలు ఏర్పాటు చేయాలని పలువరు ప్రయాణికులు కోరుతున్నారు.
 
త్వరలోనే ఏర్పాటు చేస్తాం : 
సంబంధిత ఆర్‌పీఎఫ్‌ అధికారులతో మాట్లాడుతున్నాం. ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మెటల్‌ డిటెక్టర్లు మరమ్మతుల కోసం తీసుకెళ్లినట్లు అ«ధికారులు చెప్పారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతాం.
– ఆంథోని జయరాజ్, రైల్వే స్టేషన్‌ ఎస్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement