తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగించి... ట్రాఫిక్ పునరుద్ధరించారు. అలాగే తిరుమల రెండో ఘాట్ రోడ్డులో16వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగింది. దీంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి 3 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.