25 వారాలుగా అందని కూలి డబ్బు | not gave to salary since 25 weeks | Sakshi
Sakshi News home page

25 వారాలుగా అందని కూలి డబ్బు

Published Wed, Jun 28 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

25 వారాలుగా అందని కూలి డబ్బు

25 వారాలుగా అందని కూలి డబ్బు

గుంతకల్లు రూరల్‌ : రోజంతా పనిచేస్తే గానీ కడుపు నిండని కూలి బతుకులు మావి. అలాంటిది  25 వారాలుగా ఉపాధి  కూలి డబ్బు  రాకపోతే భార్యాపిల్లలు ఏమి తినాలి, ఎలా బతకాలి అంటూ   వెంకటాంపల్లికి చెందిన ఉపాధి కూలీలు ఎంపీడీఓ శంకర్‌ ఎదుట ఏకరువు పెట్టుకున్నారు.   గ్రామంలో దాదాపు 22 మంది కూలీలకు చెందిన ఉపాధి కూలి 25 వారాలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఆధార్‌ లింకేజీ, భ్యాంకు ఖాతా అన్నీ ఉన్నా ఉపాధి కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. ఒక్కో కూలీకి రూ. 10 వేల నుంచి రూ.20 వేలకు పైగా కూలి రావాల్సి ఉందన్నారు.  ఇప్పటికైనా  కూలి డబ్బు  ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని   ఎంపీడీవోను కోరారు.  సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement