
నోటీబాక్స్..
సాక్షి, వీకెండ్: బిజీగా ఉన్న వేళల్లో మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్ ను పట్టించుకునే తీరిక ఉండదు. ఏదో పని కోసం మొబైల్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై కుప్పలుతెప్పలుగా ఉండే నోటిఫికేషన్స్ చూడగానే అన్నీ క్లియర్ చేసేస్తాం. మనకు కావాల్సిన విషయాలను వెతుక్కునే క్రమంలో చాలా ముఖ్యమైన సమాచారాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనల్ని తప్పించేందుకే ‘నోటీబాక్స్’ అనే యాప్ వచ్చేసింది. మన మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్ ను తేదీల వారీగా పొందుపరచడమే ఈ యాప్ ప్రత్యేకత. తీరిక చిక్కినపుడు హాయిగా చదివేసుకోవచ్చు.
గూగుల్ ప్లేస్టోర్‌లో notibox అని టైప్ చేసి దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలి.