రోడ్డెక్కిన ఎన్‌ఆర్‌ఐ సిబ్బంది
చినకాకాని(మంగళగిరి): మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులు, స్టాఫ్‌నర్సులు తమ వేతనాలు పెంచాలంటూ గురువారం మెరుపు ధర్నాకు దిగారు.
-
పోలీసులతో వాగ్వాదం
-
బెదిరింపులకు దిగిన యాజమాన్యం
చినకాకాని(మంగళగిరి): మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులు, స్టాఫ్‌నర్సులు తమ వేతనాలు పెంచాలంటూ గురువారం మెరుపు ధర్నాకు దిగారు. స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉదయాన్నే నర్సులంతా విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో పాటు ఆసుపత్రితో పాటు వైద్యకళాశాలకు వెల్లే వాహనాలను అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో యూనియన్ నాయకురాళ్ళును చర్చలకు పిలిపించిన యాజమాన్యం వారితో బెదిరింపు ధోరణిలో మాట్లాడడం పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. ఇప్పటివరకు ఎన్నో సార్లు వేతనాలు పెంచడంతో వాటితో సీనిచార్టీని గుర్తించి పదోన్నతులు కల్పించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన పట్టించుకోవట్లేదని అందుకనే ధర్నాకు ఉపక్రమించాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. మాజమాన్యం దిగివచ్చి సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో యాజమాన్యం పోలీసులను మొహరింపచేసింది. ధర్నాకు దిగిన నర్సులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో యూనియన్ నాయకులకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసుల వెనక్కి తగ్గారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏటుకూరి గంగాధరరావు, ఎం భాగ్యరాజ్, జేవి రాఘవులు, చెంగయ్య, కమలాకర్, కె రాము, స్వామినా«ద్, మాధవి, శివపార్వతి, రాణి, జయశ్రీ, భాగ్యలక్ష్మి, సునీత, సుజాత, శ్యామలను ఆసుపత్రి నిర్వాహకులు ఓఎస్డీ శ్యామ్, కృష్ణ,కిషోర్, శాస్త్రి, ఎస్‌ఓ సాంబశివరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్య చర్చలకు పిలిచి బెదిరించగా సూపిరింటెండెంట్ సంధ్య మరీ దరుసుగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.