ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం | ntpc electricity production stops due to technical reason | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం

Published Fri, Nov 4 2016 9:14 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం - Sakshi

ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం

రామగుండం(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఐదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. నాల్గవ యూనిట్‌లోని బంకర్ కూడా నిలిచిపోవడంతో మరో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

దీంతో పాటు వార్షిక మరమ్మత్తులలో భాగంగా 7వ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీలో ప్రస్తుతం 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిమాత్రమే అవుతుంది. ఎన్టీపీసీ పూర్తి స్థాయి సామర్థ్యం 2600 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement