పాత నేరస్తుడి దారుణ హత్య
Published Fri, Aug 19 2016 11:06 AM | Last Updated on Sat, Aug 11 2018 9:10 PM
విజయవాడ: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన పోలివెట్టి దుర్గారావు కొంతకాలంగా నందిగామలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై పలు దొంగతనాలు, ఘర్షణలకు సంబంధించి కేసులు ఉన్నాయి. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం పోరంకికి చేరుకున్న దుర్గారావు స్థానిక మిత్రులతో కలసి రాత్రి స్థానికంగా ఉండే పార్కులో మందుపార్టీ చేసుకున్నాడు. అయితే శుక్రవారం ఉదయం అతడు విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మిత్రులే అతడిని కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement