ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి | old woman died by hitting auto | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి

Published Thu, Jun 29 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

old woman died by hitting auto

కర్నూలు : నగరంలోని గౌరీగోపాల్‌ హాస్పిటల్‌ వద్ద ఆటో ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. గురువారం 12 గంటల సమయంలో ఈమె నడుచుకుంటూ వెళ్తుండగా.. ఏపీ 21 టీవై 9070 నంబరుగల ఆటో ఢీ కొనడంతో ఆమె కింద పడింది. తలకు బలమైన గాయాలవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కర్నూలు వీఆర్‌ఓ కృష్ణదేవరాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27735, 81216 15377, 08518 – 277187కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సీఐ శ్రీనివాసరావు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement