బైక్ను ఢీకొన్న డీసీఎమ్ : ఒకరు మృతి | One died and one injured in road accident in adilabad district | Sakshi
Sakshi News home page

బైక్ను ఢీకొన్న డీసీఎమ్ : ఒకరు మృతి

Published Fri, Aug 14 2015 3:24 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One died and one injured in road accident in adilabad district

ఆదిలాబాద్ : వేగంగా వెళ్తున్న బైక్‌ను డీసీఎమ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేరామెరి మండలం బారముడి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మోడీ గ్రామానికి చెందిన అత్రం భీంరామ్, లింగారావులు బైక్‌పై కేరామెరి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు.

ఆ క్రమంలో వీరి బైక్‌ను డీసీఎమ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భీంరామ్ అక్కడికక్కడే మృతి చెందగా... లింగారావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భీంరామ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు భీంరామ్కి భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడున్నట్లు పోలీసులు తెలిపారు. వారికి ఈ ప్రమాదంపై సమాచారం అందజేశామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement