అన్నను కాపాడబోయి తమ్ముడు..అది విని మరొకరు
కామేపల్లి : అన్నను కాపాడబోయి విద్యుత్ షాక్‌కు గురై తమ్ముడు మృతి చెందిన ఘటన కామేపల్లి మండలం నెమలిపురి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై జి.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. తండాలో రాంజీ అనే రైతు చేలో వ్యవసాయ కూలీ పనులకు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు భూక్య హనుమాన్(30), భూక్య మాన్సింగ్ వెళ్లారు.
కాసేపటికే గాలి వీచడంతో 11కేవీ విద్యుత్ వైరు తెగి మాన్సింగ్ కాలు పై పడింది. దీంతో షాక్ రావడంతో అతడి కాలు కాలింది. గమనించిన అతడి తమ్ముడు హనుమా న్ అన్నను కాపాడాలని కేకలు వేస్తూ మాన్సింగ్ ను పట్టుకోగా, అతడికీ షాక్ వచ్చింది. సమీపం లో ఉన్న గ్రామస్తులు వచ్చి చూసేసరికి మాన్సింగ్ కాలుకాలడంతో వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు.
ఈలోగానే హనుమాన్ కుప్పకూలి పడిపోయి అక్కడే మృతిచెందాడు. మాన్సింగ్ పరిస్థి తి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీ నాగార్జున, ఏఈ భీంసింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాఖాపరంగా హనుమాన్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
ఆగిన సమీప బంధువు గుండె..
మృతుడు హనుమాన్ చిన్నమ్మ భర్త వాంకుడోత్ జగ్గు(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విద్యుత్ షాక్‌తో హనుమాన్ మృతి చెందాడని, మాన్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయ ని తెలియగానే బిగ్గరగా రోదించాడు. ఒక్కసారిగా గుండెఆగి మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో తండాలో విషాదం నెలకొంది.