జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద సోమవారం రాత్రి డీసీఎం, స్కార్పియో ఢీకొన్నాయి.
జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద సోమవారం రాత్రి డీసీఎం, స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇక్బాల్(60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా హైదరాబాద్ వాసులే. వీరంతా స్కార్పియోలో కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.