
కోడి పుంజులు.. ఆన్‌లైన్‌లో కొనేయండి
ఆన్‌లైన్ విక్రయాల ఫీవర్ పల్లెలకూ పాకింది. పర్లా, డేగ, కాకిడేగ, పచ్చకాకి ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్ కొడితే చాలు. కావాల్సిన దాన్ని ఎన్నుకొని కొనేయవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ దగ్గర పడుతుండటంతో అమ్మకానికి ఆన్‌లైన్‌లో కోడిపుంజులు దర్శనమిస్తున్నాయి. కోడిపుంజుల అమ్మకందారులు తమ పుంజుల ఫొటోలతోసహా రంగు, వయసు, ధర, అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలతో ఉంచుతున్నారు. రూ.1,000 నుంచి రూ.లక్ష దాకా కళ్లు చెదిరే ధరలతో కోడిపుంజులు అబ్బురపరుస్తున్నాయి.
- కొవ్వూరు రూరల్ (పశ్చిమగోదావరి)