ఓపెన్ స్కూల్స్‌కు గడువు పెంపు
Published Fri, Sep 16 2016 8:24 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
అమలాపురం టౌన్ :
పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30 వరకూ గడువు పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూలు) జిల్లా కో ఆర్డినేటర్ జనార్దనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని సెంటర్ల కో ఆర్డినేటర్లు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు అమలాపురం రవీంద్ర మహర్షి విద్యాసంస్థల అధినేత గిడుగు నాగేశ్వరరావును సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం 9640335777, 9347357755 ఫోన్ నంబర్లను సంప్రదించాలని జనార్దనరావు సూచించారు.
Advertisement
Advertisement