మాట్లాడుతున్న సీతామహాలక్ష్మి
ఎచ్చెర్ల: అవయవ దానం ప్రాణ దానంతో సమానమని సావిత్రి బాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి జి.సీతామహాలక్ష్మి అన్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలలు, చిలకపాలేంలోని శ్రీ శివానీ గ్రూప్ ఆఫ్ కళాశాలల్లో శుక్రవారం అవ య దానంపై అవగాహన కల్పించారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలు ఇతర వ్యక్తులకు ఉపయోగపడతాయన్నారు. వారికి పునర్జమ్మ లభిస్తుందని తెలిపారు. కాలేయం, మూత్ర పిండాలు, కాళ్లు, గుండె వంటి అనేక అవయవాలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రస్తుతం కిడ్నీ, లివర్ సమస్యలు ఎక్కువవుతున్నాయన్నారు. విద్యార్థులందరూ అవయవ దానంపై పల్లెల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ మురళీ కృష్ణలు పాల్గొన్నారు.