
బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. గురువారం పి.మధు విజయవాడలో మాట్లాడుతూ... అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 1400 గజాల స్థలాన్ని రైతులకు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో మరో 300 ఎకరాల భూమి కోసం చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.