అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన తెలుగు, హిందీ పండిట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా మార్కుల జాబితా, ఇతర వివరాలు పొందాలని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చలానా రూపంలో మే 4లోగా చెల్లించాలని పేర్కొన్నారు.