
భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచిస్తుంటే..
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల గొంతుమీద ఆర్డినెన్స్ అనే కత్తి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ మండిపడింది. భూసేకరణ పేరుతో చంద్రబాబు తన రాక్షస మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్ధసారథి విమర్శించారు.
భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచనలో పడితే.. చంద్రబాబు మాత్రం తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కేంద్రమే మల్లగుల్లాలు పడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం రైతుల మెడపై కత్తి పెడుతూ భూములు లాక్కొంటుందని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.