‘పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు’ | payments done after checking | Sakshi
Sakshi News home page

‘పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు’

Published Sat, Jul 23 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

విశాఖ డివిజన్‌ ప రిధిలో ఉన్న శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖపట్నంలో నీరు చెట్టు కింద 6803 చెరువుల్లో పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లింపులు చేస్తామని విశాఖ డివిజినల్‌ నాణ్యతా ప్రమాణాల శాఖ ఈఈ బి.గోపాలరాజు అన్నారు.

జి.సిగడాం: విశాఖ డివిజన్‌ ప రిధిలో ఉన్న శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖపట్నంలో నీరు చెట్టు కింద 6803 చెరువుల్లో పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లింపులు చేస్తామని విశాఖ డివిజినల్‌ నాణ్యతా ప్రమాణాల శాఖ ఈఈ బి.గోపాలరాజు అన్నారు. ఆయన శనివారం మండల పరిధిలోని ఆనందపురం, అబోతులపేట, నిద్దాం, జి.సిగడాం గ్రామాల్లో గెడ్డలు, చెరువుల పనులను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాలో 2,957 చెరువులు మంజూరు చేయగా వీటిలో 2035 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. జి.సిగడాం మండలంలో ఆనందపురం వద్ద ఉన్న రెల్లి గెడ్డ పనుల అక్రమాలను తొలగించడంతోపాటు రైతులకు సకాలంలో సాగునీరు ఇవ్వడం, నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తి చెందారు. డివిజన్‌లో ఇంత వరకు సుమారుగా 80 శాతం వరకు పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఆయనతోపాటు శ్రీకాకుళం క్వాలటీ కంట్రోల్‌ డిఈఈ పి, నూకరాజు, ఏఈఈ రవికూమార్,  నీటిపారుదలశాఖ ఏ.ఈ.ఈ బి.గోవిందరావు, సిబ్బంది ఎ మహేశ్వరరావు మీసాల సీతారాం తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement