శాంతి, సౌభాగ్యాలు నిండాలని ప్రార్థించా
♦ శ్రీవారి ఆలయంలో ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటన
♦ వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు
సాక్షి, తిరుమల/తిరుపతి: వసుదైక కుటుంబంగా భాసిల్లే భారతదేశం శాంతి, సద్భావన, ఐక్యతతో ముందుకు సాగాలని బాలాజీ (శ్రీవేంకటేశ్వర స్వామి)ని ప్రార్థిం చానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం శ్రీవారి దర్శనం తర్వా త ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఎస్‌వీబీసీ ఛానల్‌తో తన పర్యటన అనుభూతిని మోదీ పంచుకున్నారు. విజయదశమి, నవరాత్రి బ్రహ్మోత్సవ ముగింపు పర్వదినాన తాను బాలాజీని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఇస్తికఫాల్ మర్యాదలతో ఘన స్వాగతం
ప్రధాన మంత్రి హోదాలో తొలిసారి నరేంద్రమోదీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శిం చుకున్నారు. సాయంత్రం 5.25 గంటలకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలసి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్,, ఈవో, ప్రధాన అర్చకులు ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. తిరుమలలో గంటన్నరపాటు గడిపిన మోదీ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి పయనమయ్యారు.
సౌకర్యాల కల్పనకు సహకారం: ప్రధాని
తిరుపతికి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో అత్యున్నత స్థాయి సౌకర్యాల క ల్ప నకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంద ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇ చ్చారు. గురువారం అమరావతి శంకుస్థాపన అనంతరం మధ్యాహ్నం 3.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అ క్కడ రూ. 191 కోట్లతో నిర్మించిన నూతన స మీకృత టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.