టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం | people reject tdp mla opening programmes | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Published Mon, Sep 7 2015 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నాడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే ఆ గ్రామస్తులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో ఇసుక తవ్వితే భూగర్భజలాలు అడుగంటుతాయని గ్రామస్తులు ఆందోళన చెందారు. దీంతో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి చేసేదేమీ లేక ఇసుకరీచ్ ప్రారంభించకుండానే వెనుదిరిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement