పోర్టు భూ సేకరణకు వ్యతిరేకంగా పేర్ని నాని ధర్నా...అరెస్ట్
కృష్ణాజిల్లా: పోర్టు భూ సేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బందరు పోర్టు భూసేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా సోమవారం మచిలీపట్నంలో నాని ధర్నా నిర్వహించారు. దీంతో పేర్ని నానిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నానికి ఈ నెల 27 వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరికాసేపట్లో నానిని సబ్జైలుకు తరలించనున్నారు.
పేర్ని నాని అక్రమ అరెస్ట్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడారు. అరెస్ట్కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారపక్ష వేధింపులపై పోరాడదామంటూ నానికి జగన్ భరోసానిచ్చారు.