రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం | person suicide.. under train | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

Published Thu, Oct 13 2016 1:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

person suicide.. under train

ఏలూరు(సెంట్రల్‌) : రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి స్థానిక నిమ్మలకాయల యార్డ్‌ సమీపంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి  5.5 ఎత్తు, లేత నీలరంగు చొక్కా, నల్లపు రంగు డ్రాయర్‌ ధరించి ఉన్నాడు.  మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్‌ నెంబరు  9440627572కు సమాచారం ఇవ్వాలని  రైల్వే పోలీసులు కోరారు. రైల్వే ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వాపత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement