- ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మా్యట్రిన్ పోస్టుల్లో ఏదో ఒకదాని కోసమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగుతో పాటు, 100 మీటర్ల పరుగు లేదా, లాంగ్ జంప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
- ఆర్‌ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పోటీల్లో అర్హత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు ఎంపికవుతారు. శరీర కొలతలు, దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 18,19 తేదీల్లో తుది రాత పరీక్ష జరుగుతుంది.
ఎస్‌ఐ ఉద్యోగాలకు రేపటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు
Published Sun, Jan 1 2017 11:49 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
– ఫోర్త్‌జోన్ పరిధిలో భర్తీ కానున్న సివిల్, ఏఆర్ ఎస్‌ఐ పోస్టులు 57
– దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సుమారు 40వేలు
– దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు 10,692
– ఏపీఎస్‌పీ రెండో పటాలంలో ఈవెంట్స్
– సమయం ఉదయం 5.30 గంటల నుంచి, సాయంత్రం వరకు
కర్నూలు: పోలీసు కొలువును సాధించేందుకు జిల్లాలో యువతీ, యువకులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఆశలకు తగ్గట్టుగా పోలీస్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో 57 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు–17న నోటిఫికేషన్ జారీ చేసింది. పురుష, మహిళ ఎస్‌ఐ అభ్యర్థులతో పాటు డిప్యూటీ జైలర్లు (పురుషులు), అసిస్టెంట్ మ్యాట్రిన్ (మహిళలు) పోస్టుల నియామకానికి అనుమతించింది.
‘సీమ’ అభ్యర్థులందరికీ ఏపీఎస్‌పీ మైదానంలో..
రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్‌ఐ అభ్యర్థులకు జనవరి 3వ తేదీ నుంచి స్థానిక ఏపీఎస్‌పీ మైదానంలో శరీర కొలతలు, శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ నేతృత్వంలో ఈనెల 12వ తేదీ వరకు ప్రతి రోజు 5.30 గంటల నుంచి సాయంత్రం వరకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. సుమారు 10692 మంది పురుష, మహిళా అభ్యర్థులు హాజరు కానున్నారు.
పీఎంటీలో అనర్హత పొందితే 12వ తేదీ అప్పీల్‌కు అవకాశం
అభ్యర్థులందరికీ స్క్రీనింగ్ టెస్టుల సమాచారాన్ని అందజేశారు. ఆయా తేదీల్లో ఉదయం పూట ఎత్తు, ఛాతి (పురుషులకు), బరువు (మహిళలకు) కొలతల (పీఎంటీ) పరీక్ష ఉంటుంది. 1600 మీటర్ల పరుగు పరీక్ష కూడా నిర్వహిస్తారు. పీఎంటీలో అనర్హత పొందిన అభ్యర్థులకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా అభ్యర్థులు చివరి రోజు జనవరి 12న డీఐజీ రమణకుమార్‌కు అప్పీలు చేసుకుని మరో సారి పీఎంటీకి హాజరు కావచ్చు. పీఎంటీతో పాటు 1600 మీటర్ల పరుగు పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను, రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ (పీఈటీ) పరీక్షలకు అనుమతిస్తారు. గత ఏడాది నవంబరు 27వ తేదీ అనంతపురం, కర్నూలు కేంద్రాలుగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 10079 మంది పురుషులు, 613 మంది మహిళలు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.
Advertisement