కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Published Tue, Jan 10 2017 12:20 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మార్క్‌పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శమంతకమణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మార్క్‌పెడ్ మద్దతు, బోనస్‌తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్‌పెడ్ జిల్లా మేనేజర్ పరిమల మాట్లాడుతూ... రైతులు కందులను తగిన నాణ్యతా ప్రమాణాలతో తీసుకవస్తే రూ.5050 ధర లభిస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి త్వరలో మరో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి, మార్క్‌ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement