పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ.. శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.
కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్, పావురం రెండూ కూడా ఒకే రకమైన పద్ధతిలో నేర్చుకుంటున్నాయని వాళ్ల పరిశీలనలో వెల్లడైంది. ఇందుకోసం వీళ్లు సుమారు 24 రకాల పావురాలను ఎంపికచేసి వాటికి రకరకాల ఆకారాలూ, వలయాల్లాంటి వాటిల్లోంచి వెళ్లి బటన్‌ను ప్రెస్ చేయడం... వంటి టాస్క్‌లను ఇచ్చారట. వాటికిచ్చిన పరీక్షలో విజయం సాధిస్తే బహుమతిగా ఆహారాన్ని అందించారు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల పరీక్షలు నిర్వహించగా అవి చాలా త్వరగా ఆ పనులు నేర్చుకుని టార్గెట్‌ను చేరుకున్నాయి.
ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్‌ఆఫ్.. ఎందుకంటే..
అంతేకాదు, కొన్ని విషయాల్ని అవి మనిషికన్నా సమర్థంగా నేర్చుకోగలిగాయట. పైగా అవి నేర్చుకునే విధానం కూడా కృత్రిమ మేధను పోలి ఉందనీ, కాబట్టి పావురం న్యూరోబయాలజీని అధ్యయనం చేస్తే కృత్రిమమేధను మరింత సమర్థంగా అభివృద్ధి చేయగలమనీ చెబుతున్నారు. లెక్కించడం నుంచి రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం వరకూ పావురాలు అన్ని పనులూ చేయగలవని పరిశోధకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment