మార్పు కోసం.. మనం మారుదాం | plastic | Sakshi
Sakshi News home page

మార్పు కోసం.. మనం మారుదాం

Aug 27 2016 11:40 PM | Updated on Oct 20 2018 4:36 PM

మార్పు కోసం.. మనం మారుదాం - Sakshi

మార్పు కోసం.. మనం మారుదాం

గాంధీ మహాత్ముడు ఒక సందర్భంలో ‘‘మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి’’ అన్నాడు. అవును పర్యావరణ పరిరక్షణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నాం. పర్యావరణానికి హాని చేసే అనేక కారకాలను మనం నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నాం.

  • పెనుభూతంలా ప్లాస్టిక్‌
  • పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
  • కొరవడిన నియంత్రణ చర్యలు
  •  
    గాంధీ మహాత్ముడు ఒక సందర్భంలో ‘‘మార్పు అనేది మన  నుంచే మొదలు కావాలి’’ అన్నాడు. అవును పర్యావరణ పరిరక్షణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నాం. పర్యావరణానికి హాని చేసే అనేక కారకాలను మనం నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నాం. వాటిలో ప్రధానమైంది పాస్టిక్‌. పాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే దాదాపు వెయ్యి సంవత్సరాలుపడుతుంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు హాని చేసే చర్యలకు స్వస్తి చెబుదాం. మార్పుకు నాంది పలుకుదాం.
     
    ఆదిలాబాద్‌ రూరల్‌ : ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న అంశం పాస్టిక్‌ వినియోగం. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే కారకంగా ప్లాస్టిక్‌ మారింది. ఈ ప్లాస్టిక్‌ భూతాన్ని తరమేయడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలను శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు అన్వేషిస్తున్నాయి. కొంత వరకు సఫలం కూడా అయ్యాయి.
    ప్లాస్టిక్‌ అంటే..
    ప్లాస్టిక్‌ రెండు కత్రిమ అణువుల సమ్మేళనం. అవి పోలిమర్లు, మోనోమర్లు. ఈ రెండు అణువుల మధ్య రసాయనిక చర్య జరిపి ప్లాస్టిక్‌ను తయారు చేస్తారు. ప్లాస్టిక్‌ తయారీలో ఎథిలిన్‌ దోహదపడుతుంది. ప్లాస్టిక్‌ తయారీకి పెట్రోలియంను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్‌ తయారీ కోసం క్రూడ్‌ ఆయిల్‌ను 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత ఆ మిశ్రమంలో నాఫ్తా అనే పదార్థాన్ని కలిపి తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేస్తారు. ఆ మిశ్రమాన్ని 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. దాంట్లో వివిధ రకాల రసాయనాలను కలిపితే చివరకు ప్లాస్టిక్‌ తయారవుతుంది. 
    ప్లాస్టిక్‌ గురించి కొన్ని నిజాలు
    •  పెట్రోలియం సహాయంతో తయారవుతుంది.
    •  ప్రపంచంలోని అన్ని దేశాలు దీని వల్ల పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. 
    • ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది, 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చు అవుతోంది. 
    •  ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే వివిధ రసాయనాల వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 
    •  కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులను ప్లాస్టిక్‌ తయారీలో వాడుతారు. వీటి వల్ల ప్రజలకు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మెదడు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
    •  ప్లాస్టిక్‌ని తినడం కారణంగా ఏటా అనే లక్షల్లో మూగజీవులు చనిపోతున్నాయి. 
     
    పరిష్కారం
    1.  ప్లాస్టిక్‌ సంచులకు బదులు జనపనారతో తయారు చేసిన సంచులను వాడండి.
    2.  వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడండి.
    3.  కిరాణం నుంచి చిన్న చిన్న కొని తెచ్చుకునేప్పుడు కవర్లను అడగకండి.
    4.  పర్యావరణాన్ని కలుషితం చేసే 40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులను నిషేధించండి.
    5.  క్యారీ ఏ బ్యాగ్‌.. నాట్‌ క్యారీ బ్యాగ్‌ అనే విధానాన్ని అలవర్చుకోండి.
     
    మనం ఏం చేద్దాం...
    • ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే నష్టాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం.
    •  మనం ఉంటున్న భూమిని రక్షించుకునేందుకు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడకుండా ఉందాం.
    •  ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిపుణుల సూచనల ప్రకారం పాతిపెట్టడం వంటివి చేద్దాం.
    • కూరగాయల కొనుగోలు దగ్గరి నుంచి గహోపకరణాల కొనుగోలు వరకు సాధ్యమైనంత వరకు వస్త్రాలతో తయారు చేసిన సంచులనే వాడుదాం.
    •  ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలతో కలిసి నడుద్దాం.
    •  ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిద్దాం.
    •  అధికారులతో కలిసి ప్లాస్టిక్‌ నియంత్రణ చర్యలకు పూనుకుందాం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement