నర్వ(మహబూబ్‌నగర్) : తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారని ఓ బాలిక జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. స్పందించిన ఎస్పీ విశ్వప్రసాద్ దేవరకద్ర పోలీసులను ఆదేశించడంతో వారు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి ఆగిపోవడంతోపాటు ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమెకు నర్వ మండలం నాగల్‌కడ్మూర్ గ్రామానికి చెందిన యాంకి కిష్టన్న కొడుకు మల్లేష్‌తో శుక్రవారం వివాహం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
బాలిక తనకు వివాహం వద్దని, చదువుకుంటానని తల్లితండ్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గురువారం నేరుగా ఫోనులో జిల్లా ఎస్పీకి తన గోడును విన్నవించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అమ్మాయి తల్లిదండ్రులతోపాటు, అబ్బాయి తరఫు బంధువులను పిలిపించారు. దేవరకద్ర ఎస్.వినయ్ కుమార్‌రెడ్డి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పెళ్లి ఆగిపోయింది. బాలికను జిల్లాకేంద్రంలోని స్టేట్‌హోంకు తరలించారు.
సార్.. నాకు పెళ్లి చేస్తున్నారు.. ఆపండి ప్లీజ్...
Published Thu, Feb 11 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement