స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను, అరెస్ట్‌యిన నిందితుడితో డీఎస్పీ సూర్యనారాయణ
కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజను అరెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 2లక్షలు విలువచేసే మద్యం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కరోనావై రస్ నియంత్రణలో భాగంగా సోమవారం ఉదయం నుంచి మాస్క్‌లపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పాతబైపాస్‌లో సుబ్బిరెడ్డి కళాశాల వద్ద సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ ఎం. సత్యనారాయణ తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు (కేఏ03 ఏడీ 1801)లో వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజ హైదరాబాద్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ ఉండగా పట్టుబడ్డాడు.
అతని వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే( 57పుల్‌బాటిళ్లు, 321 క్వార్టర్ బాటిళ్లు) మద్యం బాటిళ్లను, సుమారు 4 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని విచారించగా, వినయ్‌కుమార్‌రెడ్డి, చిన్నరాజ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీలో కొన్ని మద్యంషాపులలో మద్యం కొనుగోలు చేశారు. వాటిని వినాయ్‌కుమార్‌రెడ్డి తన అనుచరుడి ద్వారా కడపకు పంపించాడు. వినయ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకబృందాన్ని ఏర్పాటు చేశామని డీఎస్సీ తెలిపారు. ఇతనిపై చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎం. సత్యనారాయణ, హెచ్‌కానిస్టేబుల్ జె. రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు ఏ. శివప్రసాద్, ఎం. జనార్ధన్‌రెడ్డి, వి. చెండ్రాయుడు, పి. రాజేష్, ఎం. శ్రీనివాసరావు, వి. తిరుపతయ్య, సీ. సుధాకర్ యాదవ్‌లను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డీఎస్పీ సూర్యనారాయణలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment