vinay kumar reddy
-
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అనుచరుడి అరెస్ట్
కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజను అరెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 2లక్షలు విలువచేసే మద్యం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కరోనావై రస్ నియంత్రణలో భాగంగా సోమవారం ఉదయం నుంచి మాస్క్‌లపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పాతబైపాస్లో సుబ్బిరెడ్డి కళాశాల వద్ద సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్ఐ ఎం. సత్యనారాయణ తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు (కేఏ03 ఏడీ 1801)లో వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజ హైదరాబాద్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ ఉండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే( 57పుల్‌బాటిళ్లు, 321 క్వార్టర్ బాటిళ్లు) మద్యం బాటిళ్లను, సుమారు 4 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని విచారించగా, వినయ్‌కుమార్‌రెడ్డి, చిన్నరాజ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీలో కొన్ని మద్యంషాపులలో మద్యం కొనుగోలు చేశారు. వాటిని వినాయ్కుమార్రెడ్డి తన అనుచరుడి ద్వారా కడపకు పంపించాడు. వినయ్కుమార్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకబృందాన్ని ఏర్పాటు చేశామని డీఎస్సీ తెలిపారు. ఇతనిపై చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్ఐలు ఎం. సత్యనారాయణ, హెచ్‌కానిస్టేబుల్ జె. రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు ఏ. శివప్రసాద్, ఎం. జనార్ధన్‌రెడ్డి, వి. చెండ్రాయుడు, పి. రాజేష్, ఎం. శ్రీనివాసరావు, వి. తిరుపతయ్య, సీ. సుధాకర్ యాదవ్‌లను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డీఎస్పీ సూర్యనారాయణలు అభినందించారు. -
‘హామీలను విస్మరించిన టీఆర్ఎస్’: వినయ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, నందిపేట్: గత నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని నికాల్పూర్, తొండకూర్, శాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని టీఆర్ఎస్ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు పెయింటర్‌రాజు, ఎర్రం ముత్యం, అరుట్ల రమేష్, వీరేశం, ఎస్జీ తిరుపుతి, సంజీవ్, రవి, నడ్పన్న, సాయిరెడ్డి, రవి, సిరిగిరి శ్రీను, మోహన్, కొదాపురం భోజన్న, గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేయాలి మాక్లూర్: ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని బీజేపీ అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మానిక్‌భండార్, అమ్రాద్, ముత్యంపల్లి, ఒడ్యాట్‌పల్లి, మదన్‌పల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఆర్మూర్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. ఆర్మూర్‌ను ఇప్పటి వరకు స్థానికేతరులు పాలించారన్నారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని కోరారు. లోకల్ లీడర్‌కు బ్రహ్మరథం పట్టాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాల పేరిట ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుందని ఆరోపించారు. ముప్పడి గంగారెడ్డి, గంగోని సంతోష్, వినోద్, రాజు, బోజారావు, గంగాధర్, శేఖర్ పాల్గొన్నారు. -
సార్.. నాకు పెళ్లి చేస్తున్నారు.. ఆపండి ప్లీజ్...
నర్వ(మహబూబ్‌నగర్) : తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారని ఓ బాలిక జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. స్పందించిన ఎస్పీ విశ్వప్రసాద్ దేవరకద్ర పోలీసులను ఆదేశించడంతో వారు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి ఆగిపోవడంతోపాటు ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమెకు నర్వ మండలం నాగల్‌కడ్మూర్ గ్రామానికి చెందిన యాంకి కిష్టన్న కొడుకు మల్లేష్‌తో శుక్రవారం వివాహం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. బాలిక తనకు వివాహం వద్దని, చదువుకుంటానని తల్లితండ్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గురువారం నేరుగా ఫోనులో జిల్లా ఎస్పీకి తన గోడును విన్నవించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అమ్మాయి తల్లిదండ్రులతోపాటు, అబ్బాయి తరఫు బంధువులను పిలిపించారు. దేవరకద్ర ఎస్.వినయ్ కుమార్‌రెడ్డి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పెళ్లి ఆగిపోయింది. బాలికను జిల్లాకేంద్రంలోని స్టేట్‌హోంకు తరలించారు.