‘హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌’: వినయ్‌కుమార్‌రెడ్డి | TRS Party Do not Implement Promises In Nizamabad | Sakshi
Sakshi News home page

‘హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌’: వినయ్‌కుమార్‌రెడ్డి

Published Tue, Dec 4 2018 5:40 PM | Last Updated on Tue, Dec 4 2018 5:41 PM

TRS Party Do not Implement Promises In Nizamabad - Sakshi

శాపూర్‌లో మాట్లాడుతున్న వినయ్‌రెడ్డి  

 సాక్షి, నందిపేట్‌: గత నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌రెడ్డి  విమర్శించారు. మండలంలోని నికాల్‌పూర్, తొండకూర్, శాపూర్‌ గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని టీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు పెయింటర్‌రాజు, ఎర్రం ముత్యం, అరుట్ల రమేష్, వీరేశం, ఎస్‌జీ తిరుపుతి, సంజీవ్, రవి, నడ్పన్న, సాయిరెడ్డి, రవి, సిరిగిరి శ్రీను, మోహన్, కొదాపురం భోజన్న, గంగాధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేయాలి

మాక్లూర్‌: ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలను భూస్థాపితం చేయాలని బీజేపీ అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మానిక్‌భండార్, అమ్రాద్, ముత్యంపల్లి, ఒడ్యాట్‌పల్లి, మదన్‌పల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఆర్మూర్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. ఆర్మూర్‌ను ఇప్పటి వరకు స్థానికేతరులు పాలించారన్నారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని కోరారు. లోకల్‌ లీడర్‌కు బ్రహ్మరథం పట్టాలన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాల పేరిట ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుందని ఆరోపించారు.  ముప్పడి గంగారెడ్డి, గంగోని సంతోష్, వినోద్, రాజు, బోజారావు, గంగాధర్, శేఖర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement