
గుడుంబా స్థావరాలపై దాడులు
కొత్తగూడ: వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి అటవీ ప్రాంతంలో గుడుంబా స్థావరం పై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 5 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.