
రోడ్డుమీద అప్పుడే పుట్టిన పసికందు
గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుమీద వదిలేసి వెళ్లిన హృదయవిదారకర ఘటన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెల్టూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
జి. కొండూరు(కృష్ణ): గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుమీద వదిలేసి వెళ్లిన హృదయవిదారకర ఘటన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెల్టూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈరోజు ఉదయం అప్పుడే పుట్టిన మగశిశువును ఎవరో రోడ్డు మీద వదిలేసి వెళ్లారు.
అయితే అటుగా వెళ్తున్న స్థానికులకు ఆ చిన్నారి ఏడుపు వినిపించడంతో దగ్గరికి వెళ్లిచూసి అప్పుడే పుట్టిన ఓ బాబును గుర్తించారు. స్థానికులు బాబుకు వైద్య చికిత్సలు అందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బాబు తల్లిదండ్రుల ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు.