కర్నూలు: వీవీఐపీలు, వీఐపీల పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మెలకువలు తెలుసుకునేందుకు జిల్లా నుంచి పోలీసు అధికారులు శిక్షణకు వెళ్లారు. మహిళా పీఎస్ డీఎస్పీ వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచి సీఐ ములకన్న, ఒకటో పట్టణ సీఐ కృష్ణయ్యతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు విజయవాడకు వెళ్లారు. వీరికి సెక్యూరిటీ వింగ్‌పై పోలీసు ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.