కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న కాపుల పాదయాత్రకు పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి 500 మంది పోలీసులను ఇక్కడికి రప్పించిన జిల్లా పోలీసు శాఖ ఆది, సోమవారాల్లో మరో రెండు వేల మందిని రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. కాపుల పాదయాత్రకు శనివారం వరకూ
అమలాపురం టౌన్ :
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న కాపుల పాదయాత్రకు పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి 500 మంది పోలీసులను ఇక్కడికి రప్పించిన జిల్లా పోలీసు శాఖ ఆది, సోమవారాల్లో మరో రెండు వేల మందిని రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. కాపుల పాదయాత్రకు శనివారం వరకూ అనుమతులు లేని దృష్ట్యా పోలీసులు కూడా యాత్రను నియంత్రించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కాపుల పాదయాత్ర బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన స్థానిక పోలీసు కంప్యూటర్స్ భవనంలో డీఎస్పీ లంక అంకయ్యతో పాటు జిల్లాలోని ఇతర పోలీసు అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. పాదయాత్రకు కాపు జేఏసీ రూపొందించిన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలి, ఏయే రూట్లతో పోలీసులను మోహరించాలనే అంశంపై చర్చించారు. ఇదే సమయంలో అమలాపురంలో కాపు రాష్ట్ర జేఏసీ నాయకులు పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించుకున్న సమావేశంలోని నేతల ప్రసంగాల సారాంశంపై కూడా ఆయన సమీక్షించారు. పాదయాత్రకు అనుమతి లభిస్తే బందోబస్తు ఏ రకంగా ఉండాలి, అనుమతి లేకుండా యాత్ర అనివార్యమైతే బందోబస్తు ఏ స్థాయిలో ఉండాలన్న విషయాలపై సమీక్షించారు. యాత్ర సమయంలో కోనసీమను పోలీసు వలయంతో దిగ్బంధనం చేసేలా బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.