
కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్లపై దాడి చేశారు. కాగా, ఈ దాడిలో కోటి రూపాయలు విలువజేసే ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడుగురు కూలీలను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 30 మంది తమిళ కూలీలు తప్పించుకు పారిపోయినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.