
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఓ పాలిటెక్నిక్ విద్యార్థి అద్దెకుంటున్న గది లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్థులు చూడడంతో
నాగార్జునసాగర్: ఓ పాలిటెక్నిక్ విద్యార్థి అద్దెకుంటున్న గది లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్థులు చూడడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సహచర విద్యార్థులు సాయికిరణ్, అఖిల్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పాతబస్తికి చెందిన నర్సింహ కుమారుడు మధు సాగర్ పాలిటెక్కిక్ కళాశాలలో సివిల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కళాశాలలో హాస్టల్ వసతి లే కపోవడంతో పైలాన్ కాలనీలో ఇటీవల ఎత్తివేసిన ఓ స్కూల్ గదుల్లో అద్దెకు నివాసముంటున్నాడు. మధు బట్టలు ఆరేసుకునేందుకు కట్టిన వైరును దులానికి కట్టి ఉరివేసుకుని వేలాడాడు. దీనిని పక్క గదిలో ఉన్న విద్యార్థులు గమనించి వెంటనే అతడిని కిందికి దించి తొలుత కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించి అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బెట్టింగ్ ప్రభావమేనా..?
ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ కబడ్డీ ఆటకు పెద్ద ఎత్తున బెట్టిం గ్ జరిగినట్టు తెలుస్తోంది. బెట్టింగ్‌లో కొంతమంది విద్యార్థు లు నగదును పొగొట్టుకున్నట్లు సమాచారం. మధు ఖర్చుల కు తెచ్చుకున్న డబ్బులు దుబారాఖర్చుకు అయిపోయినట్లు గా సమాచారం. తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు చెబుతున్నారు.
వ్యసనాలే కారణమా..?
ఇదిలా ఉంటే కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మద్యానికి అలవాటు పడినట్లు చెబుతున్నారు. ఖర్చులు పెరగడం ఆ మేరకు తల్లిదండ్రులను అడగలేక మధు అఘాయిత్యం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.