Published
Thu, Jul 21 2016 8:03 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
‘మిషన్‌కాకతీయ’తో చెరువులకు మహర్దశ
డిండి : మిషన్ కాకతీయతో గ్రామాల్లో చెరువులకు మహర్దశ పట్టనుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని వావిల్‌కోల్ గ్రామంలోని చెరువు పూడికతీత పనులు ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జోగ్యతండాలో, ఖానాపూర్‌లలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్లను ప్రారంభించారు. అదేవిధంగా ఖానాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ గణేష్‌నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, జేఈ జగదీశ్వర్‌రావు, గ్రామ సర్పంచ్ శాంతాభాయి, రాములమ్మ, సుధాకర్‌రెడ్డి, బల్ముల తిరుపతయ్య, వెంకటేశ్వర్‌రావు, సాగర్, దామోదర్‌రావు, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.