మంకమ్మతోట : ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలు ఆర్టీసీ గుర్తింపు సంఘం నెరవేర్చాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం ప్రకటించిన 44శాతం ఫిట్‌మెంట్‌తోపాటు 19శాతం అదనంగా కలుపుకుంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు వస్తాయన్నారు
-
ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి
మంకమ్మతోట : ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలు ఆర్టీసీ గుర్తింపు సంఘం నెరవేర్చాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం ప్రకటించిన 44శాతం ఫిట్‌మెంట్‌తోపాటు 19శాతం అదనంగా కలుపుకుంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకంటే అదనంగా ఇప్పిస్తామని టీఎంయు చెప్పినట్లుగా మరో 20శాతం ఫిట్‌మెంట్ ఇప్పించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్‌రావు, అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట్‌గౌడ్, జోనల్ కార్యదర్శి జక్కుల మల్లేశం, అ«ధ్యక్షుడు వీరన్న, నాయకులు మహేష్, యూసఫ్, రమేష్, కెఎస్ రెడ్డి పాల్గొన్నారు.