చిల్లర ఉంటేనే వైద్యం
► రూ.500, వెయ్యి నోట్లను తీసుకోని ప్రైవేట్ ఆస్పత్రులు
► ప్రైవేట్ మందుల దుకాణాల్లోనూ అదే పరిస్థితి
విజయనగరం ఫోర్ట్ : డెంకాడ మండలానికి చెందిన సత్యం.. తన కుమార్తెను ప్రసవం కోసం విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చగానే వైద్య పరీక్షలు, డాక్టర్ ఫీజుకు రూ.1000 అరుుంది. దీనికోసం తన దగ్గర ఉన్న రెండు రూ.500 నోట్లను ఇచ్చాడు. అరుుతే ఆస్పత్రి నిర్వాహకులు వాటిని తీసుకోలేదు. దీంతో తన బంధువులకు ఫోన్ చేసి చిల్లర తెప్పించుని ఆస్పత్రిలో బిల్లు చెల్లించాడు.
విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీకి చెందిన ఆర్.శ్రీనివాస్ అనే వ్యక్తి.. మందులు కొనుగోలు చేయడానికి మెడికల్ షాపునకు వెళ్లాడు. మందులకు రూ.300 అరుుందని చెప్పగా.. శ్రీనివాస్ రూ. 500 నోటు ఇచ్చాడు. ఆ నోటు దుకాణం యాజమాని తీసుకోలేదు. దీంతో చేసేది లేక ఇంటికి వెళ్లి మళ్లీ రూ.300 తెచ్చి ఇచ్చి మందులు తీసుకున్నాడు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న రోగులకు ఎదురువుతున్న దుస్థితి. ఏటీఎంల్లో రూ.2 వేలు నోటు మాత్రమే రావడం.. కొన్ని ఏటీఎంలు పని చేయకపోవడం వల్ల చిల్లర దొరకడం కష్టంగా మారింది. రూ.500 నోటు తీసుకోవాలని కేంద్రం చెప్పినా ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. పాత నోట్లు తీసుకోక.. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 200 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
987 మందుల దుకాణాలు ఉన్నారుు. రూ.500, వెరుు్య నోట్లను రద్దు చేసి 20 రోజులు అవుతున్నా.. చిల్లర కోసం బ్యాంకుల చుట్లూ జనం ఇంకా పాట్లు పడుతూనే ఉన్నారు. మందుల దుకాణాల్లో రూ.500 నోటు తీసుకోవాలన్న నిబంధన ఉన్నా.. సంబంధిత యజమానులు పట్టించుకోవడం లేదు. నగదు రహిత సేవల కోసం అన్ని ఆస్పత్రులూ, మందుల దుకాణాల్లోను స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. రెండు ఆస్పత్రుల్లోనే అవి అందుబాటులో ఉన్నారుు. స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుంటే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు లెక్కలు చూపాల్సి వస్తుందని చాలామంది ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నారుు.
డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే..
మందుల దుకాణాల్లో డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే. ఎవరైనా తీసుకోకపోతే మాకు ఫిర్యాదు చేయవచ్చు. - ఎన్.యుగంధర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్
ఫిర్యాదు చేయవచ్చు..
చిల్లర లేదని వైద్యం చేయనని అనడం సరికాదు. మానవతా ద్పక్పథంతోనైనా వైద్యం అందించాలి. ఆస్పత్రుల్లో రూ.500 నోటు తీసుకోకపోతే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం. - సి.పద్మజ, డీఎంహెచ్‌ఓ