విప్ సునీత ఇంటి ఎదుట ఆందోళన
విప్ సునీత ఇంటి ఎదుట ఆందోళన
Published Thu, Sep 15 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
యాదగిరిగుట్ట : నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపవద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఇంటిని గురువారం ముట్టడించారు. ఉదయం నుంచి పడుతున్న వర్షంలోనే గ్రామస్తులు ఎమ్మెల్యే వచ్చే వరకు భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పచ్ నమిలె పాండు, ఉపసర్పంచ్ కట్ట మల్లే్లష్‌గౌడ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే మా గ్రామాన్ని యాదగిరిగుట్ట మండలంలోనే కొనసాగించాలన్నారు. లేదంటే పాలనపంగా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎస్ సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీఓను కలిసినా స్పందన లేదని తెలిపారు. మోటకొండూర్‌లో కలిపితే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం వరకు ఇంటి ముట్టడి కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో గ్రామస్తులు, అఖిలపక్షం నాయకులు చందసాయి బాబు, దూసరి కిష్టయ్య, బడే పోచయ్య, జహంగీర్, ర్యాకల స్వామి, అశోక్, భీమగాని రవి తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement