పుష్కర తీరం.. పుణ్యస్నానం
ఏటూరునాగారం/ మంగపేట : గోదావరిలో అంత్యపుష్కర స్నానాలను ఆచరించేందుకు వసుతన్న భక్తులతో ఆదివారం రామన్నగూడెం, మంగపేటల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈసందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. కాగా, సాయం త్రం గోదావరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముల్లకట్ట జాతీయ రహదారి బ్రిడ్జి కింది నుంచి నదీజలాలు ప్రవహిస్తున్న దృశ్యాలను భక్తులు సెల్‌ఫోన్‌లలో బంధించారు.