కాంప్లెక్స్‌ స్థాయిలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన | question paper design in complex level | Sakshi
Sakshi News home page

కాంప్లెక్స్‌ స్థాయిలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన

Published Wed, Sep 28 2016 6:19 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

question paper design in complex level

కంగ్టి: స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయిలోనే ప్రశ్న పత్రాలను తయారు చేసుకోవాలని ఎంఈఓ మల్లేశం సూచించారు. బుధవారం మండలంలోని తడ్కల్‌, వాసర్‌, కంగ్టి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్‌ పర్సన్స్‌, ఉపాధ్యాయులకు, విద్యా వలంటీర్లకు సులభ రీతిలో విద్యాబోధనపై అవగాహన కల్పించారు. సీసీఈ పద్ధతిలో విద్యార్థుల భాగస్వామ్యంపై దృష్టి సారించాలని, విషయ అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశాల్లో ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, పెంటయ్య, కాశీనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement