హైదరాబాద్: పద్మావతి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై ఇచ్చిన జీవో 120ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీపీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు కొ్టేసిన ఈ జీవోపై సుప్రీంకోర్టులో వేసిన అపీల్ ను కూడా ఉపసంహరించుకోవాలన్నారు. జోనల్ వ్యవస్థను ఉల్లఘించే నిర్ణయాలు సరికావని ఈ సందర్భంగా రఘువీరా పేర్కొన్నారు.
దీనివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కాల్సిన మెడికల్ సీట్లు మిగిలిన అన్ని జిల్లాలకు దక్కడ బాధాకరమని రఘువీరా అన్నారు.