ఘనంగా రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు
విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు బుధవారం సాయంత్రం రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే విభాగంలో అక్రమాల నిరోధం, ఆస్తుల పరిరక్షణలో విజిలెన్స్ విభాగానిది కీలకపాత్ర అని కొనియాడారు. రైల్వే వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా విజిలెన్స్ విభాగం చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. ఏడీఆర్‌ఎం కె.వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహించే విభాగం విజిలెన్స్ అని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్న ఈ విభాగం అధికారులు, సిబ్బందిని ఏడీఆర్‌ఎం ఈ సందర్భంగా అభినందించారు. రాయనపాడు వర్క్‌షాపు నిర్వహణ విభాగ ముఖ్య అధికారి ఆర్.వి.ఎన్.శర్మ, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ నహేమియా, సౌత్‌సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ చిత్రారాణి, విజయవాడ డివిజన్ ఇన్‌చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్.కె.రాజశేఖర్, అకౌంట్స్ విభాగ అధికారులు కె.బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.