
రాగల 24 గంటల్లో ఏపీలో వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.