ఏసీబీ కొత్త డీఎస్పీ కరణం రాజేంద్ర బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం సిటీ : ప్రజల సహకారంతో అవినీతిపరుల ఆటకట్టిస్తానని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నూతన డీఎస్పీ కరణం రాజేంద్ర అన్నారు. జిల్లా డీఎస్పీగా నియమితులైన ఆయన శుక్రవా రం బాధ్యతలను స్వీకరించా రు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కె.రంగరాజుకు విశాఖపట్నం హార్బర్ ఏసీపీగా ఇటీవల బదిలీ అరుున విషయం విదితమే. కాగా 1989లో పోలీసు శాఖలో చేరిన కరణం రాజేంద్ర ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజ మండ్రి, ఏలూరు ప్రాంతాల్లో వివిధ కేడర్లలో పని చేశారు. జిల్లాలో ఎస్సై, సీఐగా పని చేసిన రాజేంద్ర పదేళ్ల తర్వాత ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని బారువ, సోంపేట, సరుబుజ్జలి, నరసన్నపేట, విజయనగరం జిల్లా డెంకాడ, భోగాపురం, గజపతినగరంలో ఎస్సైగా పని చేసిన ఈయన పాతపట్నం, రణస్థలం సీఐగా, విజయనగరంలో ఏపీఎస్పీ బెటాలియన్‌లో డీఎస్పీగా, విశాఖపట్నం మధురవాడలో ఏసీపీగా, సీఐడీ విభాగంలో (వైజాగ్, చింతలవలస)లో పని చేశారు. ఏలూరులో 20 నెలల పాటు ఏసీబీ డీఎస్పీగా పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు.
సహకారం అవసరం
ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో ‘సాక్షి’తో రాజేంద్ర మాట్లాడారు. అవినీతిపరుల ఆటకట్టించేందుకు ప్రజలు, ఉద్యోగులతో పాటు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎవరికి ఉన్నా అలాంటి వారి వివరాలను నిర్భయంగా ఏసీబీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా సమచారం ఇవ్వాలనుకుంటే.. తన ఫోన్ నంబర్: 9440446124, లేదా ఏసీబీ కార్యాలయం, శ్రీకాకుళం: 08942-222754 నంబర్‌కు తెలియజేయాలని రాజేంద్ర కోరారు.
అవినీతిపరుల ఆటకట్టిస్తా
Published Sat, Nov 26 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
Advertisement
Advertisement