
చార్మినార్ వద్ద రాంచరణ్ సందడి
బహదూర్‌పురా: చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద టాలీవుడ్ హీరో రాంచరణ్ గురువారం సందడి చేశారు. హాక్ ఐ అనే ప్రత్యేక యాప్ పై స్థానిక ఎస్‌ఐ ముజఫర్‌తో కలిసి అవగాహన కల్పించారు. హాక్ ఐతో కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. రాంచరణ్, పోలీస్ అధికారులు కరపత్రాలను పంపిణీ చేశారు.
(చదవండి : తొలిసారి చార్మినార్ ఎక్కిన రాంచరణ్ )