'మేం రెడీ.. మీరు రాజీనామాకు సిద్దమా?'
కడప: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. కడప పట్టణంలో రవీంద్రనాధ్రెడ్డి స్థానిక మీడియాతో శనివారం నాడు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని నల్లపాడులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.